రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మృతి

 

కర్నూల్ , జనవరి 6: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

బైకును అర్ టీ సి బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

బైక్ పై యాగంటి పుణ్య క్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తున్న విద్యార్థులు సుమన్ (కర్నూలు మండలం తాండ్రపాడు), కర్నూలు నగరానికి చెందిన శిరీష, కుమారిలు ఈ ప్రమాదం లో మృతి చెందారు.