లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన ఇన్ స్పెక్టర్ సుభోద్ సింగ్ కుటుంబం

బులంద్ షహర్ లో జరిగిన మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్ సింగ్ కుటుంబం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఈ ఉదయం కలిశారు. గోవధ చేశారన్న అనుమానంతో బులంద్ షహర్ లో కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా ఒక వాహనంపై దాడి చేశారు. ఆ సందర్భంగా దాడికి పాల్పడుతున్న వారికి అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో వారు పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఇన్ స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించిన సంగతి తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన సుబోధ్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆయన వారిని అన్నివిధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో గోరక్షకుల పేరిట జరుగుతున్న దాడులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలోనే బులంద్ షహర్ లో జరిగిన మరో దాడి కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ సుబోధ్ సింగ్ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. వారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.