లతామంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు

మధుర గాయని లతామంగేష్కర్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారన్న వార్తలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ వచ్చిన ఆ సమాచారంపై ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలన్నీ వదంతులేనని లతామంగేష్కర్ ట్వీట్ చేశారు. అనారోగ్యంతో తాను ఆసుపత్రి పాలయ్యానంటూ వచ్చిన వార్తలు నమ్మవద్దనీ, తన ఆరోగ్యం బాగుందనీ పేర్కొన్నారు.