లా అండ్ ఆర్డర్ కోసమే రేవంత్ అరెస్ట్

లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడం కోసమే కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాల్సి వచ్చిందని వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ ఈ రోజు కోర్టుకు తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభను అడ్డుకుంటామంటూ రేవంత్ చేసిన ప్రకటన, సభ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స హెచ్చరికల నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామన్న రేవంత్ హెచ్చరికల కారణంగానే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే నాడు ఆయనను అరెస్టు చేసినట్లు అన్నపూర్ణ పేర్కొన్నారు. రేవంత్ ను అక్రమంగా అరెస్టయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపింది.

రేవంత్ ను అరెస్టు చేయడానికి ముందు ఆయనను బయటకు రావలసిందిగా పలుమార్లు కోరామనీ, ఆయన రాకపోవడంతో గేట్లు పగులగొట్టి లోపలకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రేవంత్ కుటుంబ సభ్యులకు ఆరెస్టకు కారణాలు వివరించామనీ, అయితే వారు సంతకాలు పెట్టడానికి నిరాకరించారనీ మాజీ ఎస్పీ కోర్టుకు తెలిపారు.

SHARE