లోక్ సభలో గందరోళం, రేపటికి వాయిదా

ఆర్బీఐ,రాఫెల్, సీబీఐ వ్యవహారాలపై చర్చ చేపట్టాలంటూ లోక్ సభలో విపక్ష సభ్యలు నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్ మహాజన్ సభాకార్యక్రమాలను చేపట్టారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితులలోనే మంత్రులు తమతమ శాఖలకు సంబంధించిన నివేదికలను సభకు సమర్పించారు. పదే పదే విజ్ణప్తి చేసినా సభ్యులు శాంతించకపోవడంతో సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ రేపటికి వాయిదా వేశారు.