వందడుగుల కథానాయకుడు

తెలుగుదేశం నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రం కోసం హైదరాబాద్ లో వంద అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ విశేషంగా ఆకర్షిస్తున్నది. ఎన్టీఆర్  వేషధారణలో ఉన్న బాలకృష్ణ వంద అడుగుల కటౌట్ ను హైదరాబాద్- నిజాంపేట చౌరస్తాలో ఏర్పాటు చేశారు.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు,మహానాయకుడు గా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి భాగం కథానాయకుడు వచ్చే నెల 9న విడుదల కానుంది. ఫిబ్రవరిలో రెండో భాగం మహానాయకుడు విడుదల కానుంది.

SHARE