వాజ్ పేయికి ప్రధాని మోడీ నివాళులు

మాజీ ప్రధాని వాజ్ పేయి 94వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్ పేయి సమాధి రాష్ట్రీయ సృతి స్థల్ వద్ద ప్రధాని మోడీ వాజ్ పేయికి నివాళులర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయికి నివాళులర్పించారు. స్మృతి స్థల్ వద్ద మన్మోహన్ కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వాగతం పలికారు. కాగా వాజ్ పేయి జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద సర్వమత ప్రార్థనల కార్యక్రమం జరిగింది.