వాషింగ్టన్ : పాక్ కు ఐఎమ్ఎఫ్ నిధులకు అమెరికా నో

పాక్ కు ఐఎమ్ఎఫ్ నిధుల విషయంలో అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. చైనా రుణం చెల్లించేందుకు పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి ఎనిమిది బిలియన్ల రుణం కోరుతున్నది. చైనా రుణం కారణంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎఎంఎఫ్ నిధుల ద్వారా దాని నుంచి బయటపడాలని పాకిస్థాన్ భావిస్తోంది. అయితే అమెరికా పాక్ కు ఐఎమ్ఎఫ్ రుణం ముంజూరును అడ్డుకోవడానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఎమ్ఎఫ్- పాకిస్థాన్ మధ్య జరిగిన భేటీ లో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక విధంగా పాకిస్థాన్ ఐఎమ్ఎఫ్ నిధుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది.

పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి చైనా రుణమే కారణమని అమెరికా భావిస్తున్నది. అయితే ఐఎమ్ఎఫ్ రుణం మంజూరు చేస్తే ఆ నిధులను పాకిస్థాన్ చైనా రుణం తీర్చడానికి ఉపయోగించే అవకాశాలున్నాయని తాము భావించడం లేదని అమెరియా చెబుతోంది. పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చేసిందని, దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తే తప్ప పాకిస్థాన్ కు ఎటువంటి సాయం అందించకూడదన్నది తమవిధానమని అమెరికా చెబుతోంది.