విజయ్ మాల్యాకు సుప్రీం షాక్

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర టోపీ వేసి లండన్ పారిపోయిన మద్యం వ్యాపారికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఈడీ తనను పారిపోయిన నేరస్తుడిగా ప్రకటించాలంటూ ముంబై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలంటూ మల్యా దాఖలు చేసిన పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు…స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే కేసును విచారణకు స్వీకరించి ఈడీకి నోటీసులు జారీ చేసింది.