విపక్షాల భేటీకి అఖిలేష్ దూరం

హస్తిన వేదికగా నేడు జరగనున్న బీజేపీయేతర పార్టీల నేతల భేటీకి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ హాజరు కావడం లేదు. ఈ విషయం స్వయంగా ఆయనే కొద్ది సేపటి కిందట తెలిపారు. తన ప్రథమ ప్రాధాన్యం ఉత్తర ప్రదేశ్ మాత్రమేనని ఆయన చెప్పారు. అందుకే ఈ భేటీకి హాజరు కావడం లేదని పేర్కొన్న అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తాను సమర్ధించడం లేదనీ, కానీ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన నేపథ్యంలో జాతీయ కూటమి విషయంలో  చురుకుగా పాల్గొన లేకపోతున్నానని ఆయన వివరించారు.