విముక్తి లభించింది : శివరాజ్ సింగ్

మధ్యప్రదేశ్ ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ తరువాత విలేకరులతో మాట్లాడారు. 15 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన తాను తన శాయశక్తులా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేశానన్నారు.రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి పూర్తిగా బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను గెలుపుబాటలో నడిపించినందుకు కమల్ నాథ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బీజేపీ కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం విషయంలో ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకరిస్తానని చెప్పారు. నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.