వేదికమీదే గడ్కరీ ఫెయింట్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వేదిక మీదే స్ఫృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లారాహూరీలోని వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గడ్కరీ ఆ కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో విస్తృత ప్రచారం కారణంగా అలసట చెందిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన నితిన్ గడ్కరి నీరసంతో స్పృహ తప్పారని ఆ వర్గాలు తెలిపాయి.