శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా

115 views

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. కొద్ది సేపటి కిందట ఎంపీ గవర్నర్ అనంది బెన్ పటేల్ కు తన రాజీనామా లేఖ సమర్పించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయాన్ని అంగీకరిస్తూ ఆయన రాజీనామా చేశారు. 230 స్ధానాలున్న మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 109 స్థానాలలో విజయం సాధించింది.

కాంగ్రెస్ 114 స్థానాలను కైవసం  చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 115కు ఒక్కస్థానం దూరంలో నిలిచిన కాంగ్రెస్ కు ఎన్నికలలో ఒక్కో స్థానంలో గెలిచిన బీఎస్పీ, ఎస్పీ సభ్యులు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు.