శృంగారంలో మీకు ఇలాంటి సమస్య వస్తుందా? కారణం తెలుసుకోండి!! (పార్ట్-2 )

Share

శృంగారం చేయడం గురించి ఆలోచన లేకుండా ఇద్దరు వీలైనంత ఎక్కువ సమయం కలిసి గడపండి. మీ భాగస్వామికి వేడి నూనెతో మసాజ్ చేయండి. లేదా ఇద్దరూ కలిసి షవర్ బాత్ టబ్ బాత్ లాంటివి చేయండి. పక్క పక్కనే కూర్చుని చేతిలో చేయి వేసుకుని టీవీ, సినిమా చూడండి. ఇవన్నీ రాత్రి పడక గదిలో కోరికల్ని పుట్టిస్తాయి.


అప్పటికి  పరిస్థితి బాగోక పొతే  ఓ సెక్స్ థెరపిస్ట్ లేదా కౌన్సిలర్ ను కలిసి సలహాలు సూచనలు పాటించడం  కూడా మంచిదే. పెద్ద సమస్య ఉంటే ఆలోచించకుండా,  ఏ మాత్రం సిగ్గుపడకుండా మీ సమస్య పరిష్కారానికి మార్గం వెదకండి. దీనివల్ల లైంగిక సమస్యలకు అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోవచ్చు.

పడక గదిలో ఉన్నప్పుడు  ఒక్క శృంగారం మీద మాత్రమే  దృష్టి పెట్టకుండా, కలయిక సమయంలో మీ మెదడు డైవర్ట్ చేయండి.సెక్స్ సాంగ్స్ వినండి  లేదా ఏదైనా టీవీ ప్రోగ్రాం చూస్తూ.. పని కానీయండి. ఇలా చేయడం వలన సరిగా చేయగలనో లేదో అనే ఆలోచన నుంచి మీరు బయటపడతారు . అది మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది….సరిగా చేయలేక పోతున్నాను అనే భావనతో కృంగిపోకండి.

ఇది మీ లో ఉన్న  సమస్య  అని మాత్రం అనుకోకండి. ఒత్తిడి, ఆందోళన, ఆఫీసు పనులు, బాధ్యతలు  .. ముఖ్యంగా ఆత్మగౌరవ సమస్య  ఇలా చాలా కారణాలే ఉంటాయి…. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ సమస్యలు ఎదురుకోవడానికి దారులు వెదకండి.  నిపుణులు సూచించిన సలహాలు సూచనలు పాటించండి. ఈ సమస్య  ఎప్పుడు మీ ఇద్దరు కలిస్తేనే  పరిష్కారం దొరుకుతుంది అని మరువకండి.


Share

Related posts

ఎక్స్‌ప్రెస్ టివి అధినేత చిగురుపాటి జయరామ్ హత్య

somaraju sharma

Alzheimer’s: ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పొతే  పూర్తిగా  జ్ఞాపక శక్తి పోవడం ఖాయం!!

Kumar

కొత్తిమీర ను అస్సలు ఇలా వాడకండి!!

Kumar