శృంగారం లో మీకు ఇలాంటి సమస్య వస్తుందా? కారణం తెలుసుకోండి!!(పార్ట్1 )

Share

శృంగారం పూర్తిగా ఆస్వాదించాలి అంటే మాత్రం   మానసికంగా, శారీరకంగా కూడా సిద్ధం గా ఉండాలి. ముఖ్యంగా మీ భాగస్వామిని మెప్పించగల మా  లేదా అనే సందేహం మీకు  అస్సలు ఉండకూడదు. ఆ ఆలోచన  ఒక్కసారి మనస్సులోకి వచ్చిందా.. అది  మిమ్మల్ని యాంగ్జైటీ లో పడేస్తుంది.శృంగారం లో ఇలాంటి ఆందోళనలు  కలగడానికి  అనేక కారణాలుంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్,  ఒత్తిడి,అంతకుముందు ఏదైనా ఇబ్బందులు రావడం ఇలాంటి ఏదైనా కూడా  మీ లైంగిక జీవితాన్ని పడకగదిలో మీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి.


దీంతో శృంగార కోరికలు  తగ్గి  లైంగిక హార్మోన్ల పనితీరు పై ఆ  ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. దీనికోసం హార్మోన్ ఇంజక్షన్లు, మందులు వాడాల్సి వస్తుంది. అంత దాకా వెళ్లకుండా సహజపద్ధతుల్లో మ యాంగ్జైటీ  తగ్గించుకునే  మార్గాలు గురించి తెలుసుకుందాం. మీలోని ఆ సామర్థ్యం కొరత గురించి, ఆందోళన గురించి ఏదైనా కూడా  మీ భాగస్వామితో  పంచుకోండి. ఎంత  వీలైతే అంత ఎక్కువ మాట్లాడండి. దీనివల్ల సమస్య చాలా వరకు  పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మీతో పాటు మీ భాగస్వామి కూడా శృంగారంలో నష్టపోతుంది కాబట్టి.. తనతో మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం మాట్లాడండి.

ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. శృంగారానికి  ముందు ఎక్కువ సేపు ఒకరితో ఒకరు గడపడం వలన  ఒకరికొకరు అలవాటుపడి యాంగ్జైటీ బాగా తగ్గుతుంది. దీనికితోడు ఫోర్ ప్లే చేయాలి.  అది కూడా మెల్ల మెల్లగా ఎక్కువ సమయం  తీసుకుంటూ చేయడం వల్ల యాంగ్జైటీ తగ్గి  సహజం గా శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనడం జరుగుతుంది.


Share

Related posts

చర్మం కాంతివంతంగా మెరవడానికి కల్తీ లేని ఈ పానీయం తీసుకోవడం ఒక్కటే మార్గం!!

Kumar

ఐపీఎల్ : ప్లే ఆఫ్ రేస్ కిక్కే వేరప్పా 3, 4 తేలేది నేడే

Special Bureau

ఆమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం!

somaraju sharma