శ్రీకాకుళంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర- నేడు 313వ రోజు

ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన  పాదయాత్ర నేడు 313వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళంలో సాగుతున్న ఆయన యాత్ర నేడు ఎచ్చెర్ల, ఆముదాల వలస నియోజకవర్గాలలో కొనసాగుతుంది. తన పాదయాత్రలో ప్రజాసమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ పై కూడా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.