సజ్జన్ కుమార్ లొంగిపోవలసిందే!

ఢిల్లీ సిక్కుల ఊచకోత కేసులో దోషిగా రుజువై జీవిత ఖైదు శిక్షకు గురైన కాంగ్రెస్ మాజీ నాయకుడు సజ్జన్ కుమార్ వెంటనే లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సిక్కుల ఊచకోత కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన తనకు లొంగిపోవడానికి నెల రోజుల గడువు కావాలంటూ సజ్జన్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసందే.

అయన అభ్యర్థన ఈ రోజు కోర్టు ముందుకు వచ్చింది. అయితే సజ్జన్ కుమార్ పిటిషన్ ను ప్రభుత్వ న్యాయవాది సవాల్ చేశారు. దీనిపై వాదోపవాదాల అనంతరం సజ్జన్ కుమార్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆయన వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పై కోర్టును ఆశ్రయించే వీలు మాత్రం కల్పించింది.