సర్జికల్ స్ట్రైక్స్ తో రాజకీయం

కేంద్రంలోని మోడీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయ ప్రయోజనం కోసం పెద్దగా ప్రచారం చేసుకున్నది. ఈ విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. రెండేళ్ల కిందట జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ను అవసరానికి మించి ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ భూభాగంలోనికి ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం అప్పడు అనివార్యమైందని అందుకే సైన్యం ఆ పని చేసిందని, దీనితో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. సైన్యం ఘనతను రాజకీయం కోసం ప్రచారం చేసుకోవడం ఎంతమాత్రం తగదని హూడా అభిప్రాయపడ్డారు. సైనిక విజయాలను రాజకీయ అవసరాలకు వాడుకోవడం సరైనదా కాదా అన్నది రాజకీయ నేతలే నిర్ణయించుకోవాలని మిలిటరీ టీటరేచర్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ అన్నారు.