సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ

సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్ధారించిన అమెరికా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర సంస్థపై యుద్ధంలో అమెరికా సేనలు విజయం సాధించాయని ప్రకటించింది. సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని వైట్ హౌస్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎస్ పై విజయం సాధించిన సేనలను అభినందిస్తున్నట్లు పేర్కొంది.

సంకీర్ణ దళాలు ఐఎస్ పై ఘన విజయం సాధించాయని పేర్కొన్న పెంటగాన్..ఉగ్రవాదంపై పోరు ఇంకా ముగియలేదని పేర్కొంది. సిరియాలోని అమెరికా సైన్యం ఉపసంహరణ  సంపూర్ణంగా పూర్తి అయ్యయేందుకు రెండు నెలలు పడుతుందని పేర్కొంది.

SHARE