‘సుప్రీం’ను ఆశ్రయించిన సజ్జన్ కుమార్

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు తనను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ సజ్జన్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1984 ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,   మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.

తీర్పు వెలువడిన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శిక్ష అనుభవించేందుకు తనకు నెల రోజులు గడువు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో సజ్జన్ కుమార్ ధాఖలు చేసుకున్న పిటిషన్ ను తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సజ్జన్ కుమార్ సుప్రీం కోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ కోర్టు తీర్పును ఆయన సవాల్ చేశారు. ఈ విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది  దృవీకరించారు.