ట్రెండింగ్ న్యూస్ సినిమా

స్టేజీ పై అలా పిలిచేసరికి వర్ష ని హత్తుకొని ముద్దు పెట్టేసిన జబర్దస్త్ ఇమాన్యుయెల్…!

Share

ఈ మధ్య తెలుగు కామెడీ షో జబర్దస్త్ లో ప్రేమజంటల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సుధీర్-రష్మీ తర్వాత అంతగా పాపులర్ అయిన జంట ఇమాన్యుయెల్-వర్ష అనే చెప్పాలి. ఎలాంటి హడావుడి లేకుండా సడన్ గా వచ్చేసి వీరిద్దరూ ప్రేక్షకులలో ఆసక్తి పెంచుతున్నారు. ప్రతి వారం వీరిద్దరి గురించి ఒక చిన్న రూమర్ అయినా రాకుండా పోవట్లేదు.

 

తాజాగా జబర్దస్త్ షో లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అది కాస్తా యూట్యూబ్ లో ట్రెండింగ్ అయిపోతుంది. వివరాల్లోకి వెళితే టెలివిజన్ నటి వర్ష ఈ మధ్య జబర్దస్త్ లో తరచూ స్కిట్ లు చేస్తూ ఉంది. అంతేకాకుండా యంగ్ టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యుయెల్ తో కలిసి కెవ్వు కార్తీక్ టీం లో ఆమె చేసే పాత్రలకు మంచి పేరు వస్తుంది. ఇందులో భాగంగానే వచ్చేవారం ఈ టీం ‘ఇడియట్’ సినిమా స్పూఫ్ చేయనున్నారు.

ఇప్పటివరకు ఇమాన్యుల్ కు జోడిగా ఎన్నో పాత్రలు పోషించిన వర్ష ఈ సారి మాత్రం అతని కూతురు గా స్కిట్ చేసింది. ఇద్దరూ తండ్రీ-కూతుళ్ళగా గా నటించడంతో కామెడీ మరింత పండింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంది అని ముందే తెలుసు. అయితే వర్ష ఇమాన్యుయెల్ దగ్గరికి వచ్చి నాన్న నాన్న అని పిలుస్తుంటే… ముందు అలా పిలవద్దు అని తర్వాత దొరికిందే సందు అన్నట్లు రా అమ్మ తల్లి అని ఇమాన్యుల్ వాటేసుకుని తల మీద ముద్దు పెట్టాడు.

అలా ప్రోమోలోనే ఒకటికి రెండుసార్లు ముద్దు ఇచ్చి తర్వాత నాలుక కరుచుకున్న ఇమాన్యుయెల్ తర్వాత నాది తండ్రి క్యారెక్టర్ కావడం వల్లే ఆమె పై ప్రేమ కురిపించాను అన్నట్లు కలరింగ్ ఇచ్చాడు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.


Share

Related posts

Poonam Bajwa Alluring Clicks

Gallery Desk

‘పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు’

somaraju sharma

వెంకీ సినిమాను శర్వానంద్ లాగేసుకున్నాడా? ఇదెక్కడి దారుణం??

sowmya
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar