స్తంభించిన అమెరికా పాలన

అమెరికా పాలన స్తం భించిపోయింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానా నికి కాంగ్రెస్‌ ఆమోదం లభించలేదు. దీంతో  అమెరికా లో ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.    అమెరికా- మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సం బంధిం చిన నిధుల విషయమై ట్రంప్‌, డెమోక్రాట్ల మధ్య రాజీ  కుదరకపోడంతో ఈ పరిస్ధితి తలెత్తింది. సరిహద్దులో గోడ నిర్మించేం దుకు ట్రంప్‌ సర్కార్ 5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు డిమాండ్‌ చేసింది. దీనికి డెమో క్రాట్లు వ్యతిరేకించి నిధుల విడుదల తీర్మానానికి కాంగ్రెస్ ఆమోదం లభించకుండా చేశారు. దీంతో  అగ్రరాజ్యంలో పాలన స్తంభించిపోయింది. అమెరికా ఖజానా నుంచి నిధుల విడుదల నిలిచిపోవడంతో  దాదాపు 8లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు వేతనాలు అందరి పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ పరిస్థితి ఏర్పడడానికి డెమోక్రాట్లే కారణమని ట్రింప్ విమర్శించారు.  ఇలా ఉండగా  క్రిస్మస్‌ పం డుగ  సమయంలో ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతున్నది. ట్రంప్ హయాంలో ఈ  ఏడాదిలో అమెరికాలో పాలన స్తంభించడం ఇది  మూ డోసారి కావడం గమనార్హం.