హనుమంతుడు దళితుడు కాదు…ముస్లిం!

పురాణ గాధలలో మహాపురుషులకు మతం కులం అంటగట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లాయి. హనుమంతుడు దళితుడు అంటూ ఒక బీజేపీ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదం సద్దుమణగకముందే…మరో బీజేపీ ఎమ్మెల్సీ ఆంజనేయుడు ముస్లిం అంటూ వివాదానికి తెరలేపారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ హనుమంతుడు ముస్లిం అని సెలవిచ్చారు. హనుమాన్ అందరికీ చెందిన వాడనీ అంటూనే తన ఉద్దేశం ప్రకారం ఆయన ఒక ముస్లిం అని పేర్కొన్నారు. ఇందుకు ఆధారంగా ఆయన ముస్లింల పేర్లన్నీ హనుమాన్ నామంలో కలిసి ఉంటాయని పేర్కొన్నారు. రెహ్మాన్, రంజాన్, ఖుర్జాన్ అంటూ ఉదాహరణలు చెప్పుకొచ్చారు.