హమ్మయ్య డీల్ కుదిరింది!

బీహార్ లో ఎట్టకేలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య డీల్ కుదిరింది.వచ్చే లోక్ సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జీపీ) మధ్య ఎట్టకేలకు ఒక  అవగాహన కుదిరింది. బంధం తెగిపోతుందా అన్నంత తీవ్ర ఉత్కంఠ మధ్య మూడు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుకు అవగాహన కుదరడంతో మహాగట్బంధన్ కు లోక్ సభ ఎన్నికలలో దీటైన పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఏర్పడింది. ఆక సీట్ల సర్దుబాటుకు సంబంధించి మూడు పార్టీలూ కలిసి ఈ రోజు ఒక సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 18 స్థానాలలో పోటీ చేస్తుంది. 17 స్థానాలలో జేడీయూ పోటీలోకి దిగుతుంది. ఇక ఐదు స్థానాలతో సరిపెట్టుకోవడానికి లోక్ జనశక్తి పార్టీ అంగీకరించింది. ఈ మేరకు మూడు పార్టీల నేతలూ ఈ రోజు అధికారికంగా ప్రకటన చేస్తారు.