హరీష్ ఆధిక్యం- వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్లు

Share

 

తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. హరీష్ రావు భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నది. హరీష్ రావుమూడో రౌండ్ పూర్తయ్యే సరికి 19 వేలకు పైగా ఆధిక్యత సాధించింది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి వెనుకబడ్డారు. కూకట్ పల్లిలో తెలుగుదేశం అభ్యర్థి నందమూరి సుహాసిని వెనుకబడ్డారు. హుస్నాబాద్ లో సీపీఐ అభ్యర్థి చాట వెంకటరెడ్డి వెనుకంజలో ఉన్నారు. బాల్కొండలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి వెనుకబడ్డారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయం కోసం ఎదురీదుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య, డీకే ఆరుణ, సబితారెడ్డి, గీతారెడ్డి, జానారెడ్డి తదితరులు తమతమ సమీప ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉన్నారు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తొలి రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్ 68 స్థానాలలో, కాంగ్రెస్ కూటమి 28 స్థానాలలో ముందంజలో ఉన్నాయి, బీజేపీ 2 స్థానాలలో, ఎంఐఎం 7 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాలలో ముందంజలో ఉన్నారు.


Share

Related posts

సోనూసూద్ మరో సాయం.. ఈసారి విద్యార్థుల కోసం ఏం చేశారంటే?

Varun G

మందు బాబులపై ఎందుకీ కక్ష!! జగన్ కు సగటు మందుబాబు ప్రశ్న

Special Bureau

Vishnav Tej – Krish : క్రిష్- వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..

bharani jella

Leave a Comment