హిమాచల్ రాష్ట్ర మాత ఆవు

ఆవును రాష్ట్రమాతగా ప్రకటిస్తూ హిమాచల్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన హిమాచల్ అసెంబ్లీ కేంద్రానికి పంపింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ కూడా ఆవును రాష్ట్రమాతగా ప్రటకించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్  కూడా గోవుల పరిరక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గోరక్షణ పేరిట దేశంలోని పలు రాష్ట్రాలలో మూక దాడులు, హింసాకాండ జరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ గోవును రాష్ట్రమాతగా ప్రకటిస్తూ తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.