హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలు : భారీ బందోబస్తు- పోలింగ్ కు సర్వం సిద్ధం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్నది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పోలీస్ బాస్ తెలిపారు.    రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వివరించారు.   ఎక్కడైనా అనుకోని సంఘటనలు, సమస్యలు ఎదురైతే వెంటనే చేరుకోవడానికి వీలుగా హెలికాప్టర్లను కూడా సిద్ధంగాత ఉంచినట్లు వివరించారు.    ఎన్నికల భద్రత కోసం 275 కంపెనీల కేంద్ర బలగాలు, ఆరు రాష్ట్రాల పోలీసు సిబ్బంది  సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 11,853 నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయగా,  8,481 లైసెన్సు ఆయుధాలను   డిపాజిట్‌ చేసుకున్నట్లు పోలీస్ బాస్ తెలిపారు.   ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.120 కోట్లకు పైగా నగదుతో పాటు రూ.2.04 కోట్ల విలువ చేసే 4లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.