హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసినా..ప్రలోభాల పర్వం ఆగలేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు మాత్రం ఇంకా ఆగలేదు. రేపు పోలింగ్ జరుగుతుందనడా ఈ రోజు ఉదయం రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  పెద్ద  మెత్తంలో అక్రమంగా తరలిస్తున్న సొమ్ము పట్టుబడింది. ఆలేరు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లలో పోలీసుల తనిఖీలలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.  ఓటర్లకు పంచేందుకే ఈ సొమ్మును తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల సందర్శంగా దాదాపు వంద కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.