హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రం 5 గంటల తరువాత ప్రచార గళాలు మూగపోతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముగుస్తుంది. మిగిలిన 106 నియోజకవర్గాలలో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఎందుకంటే సిర్పూర్,  చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసీఫాబాద్, మథని, భూపాలపల్లి, ములుగు, పీనపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలలో 7 ఉదయం 7 గంటలనుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. దాంతో పోలింగ్ కు 48 గంటల ముందు అంటే ఈ సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది. మిగిలిన నియోజకవర్గాలలో ఈ సాయంత్రం 5 గంటల వరకూ ప్రచార గడువు ఉంది. ఇలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబధించి అన్ని ఏర్పాట్లనూ ఎన్నికల సంఘం పూర్తి చేసింది.