హైదరాబాద్ : తొలి మూడు గంటల్లో 12శాతం పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా ఉదయం పది గంటల వరకూ 12శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి తెలంగాణలో ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఉదయం మూడు గంటలకే 12 శాతం నమోదు కావడం విశేషం. ఇక జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ లో తొలి మూడు గంటలలో 7శాతం పోలింగ్ నమోదైంది. రంగారెడ్డిలో 8%, మహబూబ్ నగర్ జిల్లాలో 11%, నల్గొంగ జిల్లాలో 11%, ఆదిలాబాద్ జిల్లాలో 10శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. జగిత్యాలలో అత్యధికంగా తొలి మూడుగంటలలో 18శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

SHARE