ఒకసారి కోవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న వారు కూడా మరోసారి కోవిడ్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారిలో తక్కువ మొత్తంలో యాంటీబాడీలు రావడం , రోగనిరోధక శక్తి తక్కువగా శాతం ఉండటం, వైరస్ ప్రభావానికి తరచుగా గురికావడం వల్ల మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుంది . కానీ వారిలో వైరస్ తీవ్రత కొంత తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి .
కోవిడ్ సోకినతర్వాత ఎన్ని రోజుల్లో వ్యాధి పూర్తిగా తగ్గుతుందో చెప్పడం కష్టం. ఇది వ్యక్తి వయసు, శరీర వ్యవస్థ, రోగనిరోధక శక్తి, చికిత్సపై ఆధారపడి ఉంటుంది. వైరస్ తగ్గి పూర్తిగా కోలుకుని, నార్మల్ స్థితికి వచ్చిన వారు సాధారణ కార్యకలాపాలు యథావిధిగా చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సైతం వెళ్లవచ్చు. కరోనా లక్షణాలు బయట పడ్డ తర్వాత 17 రోజులు తర్వాత ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు అని కోవిడ్ మార్గదర్శకాలు తెలియచేస్తున్నాయి. ఐసోలేషన్ వ్యవధి కూడా 17 రోజులుగానే చెప్పబడింది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న పరిస్థితులలో వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఏసీ గదుల్లో ఉండేవారు ముందుజాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవి కారణం గా ఏసీ గదుల్లో ఉండేవారు 24-30 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ రోజుల్లో ఏసీలకు బదులుగా కూలర్లను వాడటం అన్ని విధాలా మంచిదని డాక్టర్లు తెలియచేస్తున్నారు .
గాలి, వెలుతురు ప్రసరించే గదుల్లో కూలర్ వాడటం వల్ల వేసవి తాపం తో పాటు కరోనా ప్రభావం నుంచి కూడా తప్పించుకోవచ్చని తెలియచేస్తున్నారు . కరోనా నుంచి కోలుకున్న వారు తమ వయసు, శరీర తత్వాన్ని బట్టి కొన్ని వ్యాయామాలు చేయడం మంచిది . నిపుణుల సలహాలు తీసుకుంటూ, మరింత శక్తివంతంగా మారాలి. పోషకాహారం తీసుకోవడం తో పాటు , శ్వాస కు సంబందించిన వ్యాయామాలు, ఇతర ఎక్సైజ్ లు చేయాలి. అలా చేసేటప్పుడు తప్పనిసరిగా వైద్య నిపుణులు తీసుకోవడం అన్ని విధాలా మంచిది.