చాలా మందికి బరువు తగ్గాలని ఉంటుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థం కాదు. అలాంటి వారికోసం ఈ విధానం.దీని కోసం రోజువారీ తీసుకునే ఆహారంలో… జీలకర్ర నీరు కి స్థానం కల్పించాలి. రోజూ రాత్రిపూట ఓ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఓ గ్లాస్ నీటిలో నానబెట్టుకోవాలి. తెల్లారి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం రావడం తో పాటు చర్మం కాంతి వంతం గా కూడా ఉంటుంది.ఇలా రోజూ చేస్తుంటే కనుక మన శరీరంలో జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది .
తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా ఎప్పటికప్పుడు జీర్ణం అయిపోతుంది అని అధ్యయనాల్లో బయటపడింది. లివర్లో విషపూరిత వ్యర్థాలు ఉంటే కనుక జీలకర్ర నీరు తాగడం వలన అవి బయటకు వచ్చేసి లివర్ బాగా పనిచేస్తుంది.జీలకర్ర లోని కొన్ని ఔషధ గుణాలు నీటి ద్వారా శరీరంలోకి వెళ్లి, ఊపిరితిత్తులు బాగా పనిచేయడానికి సహాయపడతాయి. రకరకాల శ్వాసకోస సమస్యల కు జీలకర్ర నీరు ఒక చక్కని పరిష్కారం గా చెప్పబడుతుంది. శ్వాస కూడా బాగా ఆడుతుంది. అందువల్ల రోజూ ఉదయం నానా పెట్టిన జీలకర్ర నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. తిన్న ఆహారం పేగుల్లో ఉండి పోవడం వలన కొన్ని రకాల నూనెలు పేగుల గోడలకు అంటుకు పోయి అలాగే నిల్వ ఉండి పొట్ట లో రకరకాల వ్యాధులు రావడం తో పాటు అనారోగ్యాలకి కూడా కారణం అవుతాయి. కాబట్టి తిన్న ఆహారం కచ్చితంగా జీర్ణం అయ్యేలా చేసుకోవాలి.
ఇలాంటి వాటికీ జీలకర్ర నానబెట్టిన నీరు బాగా పనిచేస్తుంది .జీలకర్రలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన పొట్టలోకి వెళ్ళాక, జీర్ణ ప్రక్రియ వేగంగా జరిగేలా చేస్తుంది. పైగా ఆకలి ని కూడా అదుపు చేస్తుంది. అందువల్ల ఈ నీరు తాగిన వారికి ఆకలి తక్కువగా ఉంటుంది. శరీరంలో చెడు కొవ్వు కరిగిపోతూ ఉంటే… తేలికగా బరువు తగ్గుతారు. బరువు పెరగడానికి ప్రధాన కారణం పొట్టే అని చెప్పుకోవచ్చు. పొట్టను తగ్గించుకుంటే … దాని చుట్టూ ఉండే కొవ్వు కూడా తగ్గిపోతుంది. చురుగ్గా తయారవుతాం.