శుభ్రమైన మచ్చలు లేని అండర్ ఆర్మ్స్ కోసం తేలికగా చేసుకునే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. హీరోయిన్స్ అండర్ ఆర్మ్స్ చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి… అది చూసి అమ్మాయి లు తమకు అలా కావాలని కోరుకున్న ఏమి చేయాలో తెలియక సతమతమవుతుంటారు. వారికీ మాత్రం ఇది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యతో చాలామంది అమ్మాయిలు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ వేసుకోవాలని కోరిక ఉన్నా.. ఈ సమస్య కారణంగా భయపడుతూ వాటికి దూరంగా ఉంటారు.
దాదాపు అందరూ స్నానం చేసిన తర్వాత శరీరానికి , ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటారు. అలాగే అండర్ ఆర్మ్స్ కి కూడా రాస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నలుపు సమస్య తగ్గుతుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. అండర్ ఆర్మ్స్ లో ఉండే హెయిర్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాస్తూ ఉండడం వల్ల అక్కడ చర్మానికి నలుపు సమస్య తగ్గుతుంది. డెడ్ స్కిన్ వలన కూడా అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతుంటాయి. కాబట్టి.. ఆ ప్రదేశంలో వారానికి ఒకసారి స్క్రబ్బర్ తో నెమ్మదిగా రుద్దుతూ ఉండాలి. అయితే.. అక్కడ ప్రదేశం చాలా సున్నితం గా ఉంటుంది కాబట్టి కఠినం గా లేని స్క్రబ్బర్ వాడటం మంచిది…. అండర్ ఆర్మ్స్ తెల్లగా చేసే క్రీములు చాలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి . నిజం చెప్పాలి అంటే వాటిని పొరపాటున కూడా,వాడకుండా ఉండటం ఉత్తమం .
ఎందుకంటే వాటిలో హాని చేసే రసాయనాలు ఉంటాయి.అండర్ ఆర్మ్స్ లో హెయిర్ క్లీన్ చేసుకోవడానికి రేసర్ వాడుతున్నట్లయితే.. దానికి బదులు వ్యాక్స్ చేయించుకోవడం మంచిది. వ్యాక్స్ చేయించడం వల్ల డెడ్ స్కిన్ కూడా పోతుంది. ఇలా చేయడం వలన నలుపు సమస్య తగ్గుతుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఈ సహజ పద్ధతులు కూడా పాటించడం వలన మంచి ఫలితం ఉంటుంది.