ప్రోనింగ్ చేయాలనుకున్నప్పుడు ముందు మంచంపై బోర్లా పడుకుని మెత్తటి దిండును మెడ కింద భాగంలో పెట్టుకోవాలి . తర్వాత చెస్ట్ భాగం నుంచి తొడల వరకు శరీరానికి ఆసరాగా రెండు దిండ్ల వరకు ఉంచుకోవచ్చు . ఆ తర్వాత ఇంకో రెండు దిండ్లను మోకాలి కింద ఉండేలా పెట్టుకోవాలి . ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు వేగంగా, పూర్తి స్థాయిలో శ్వాసతీసుకుంటుండాలి . ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయి చక్కగా పెరుగుతుంది.
ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులు రోజంతా ఒకే విధం గా కాకుండా, వివిధ పొజిషన్ లో కి మారుతూ రెస్ట్ తీసుకోవాలి . ఈ క్రమంలో ఒక్కో పొజిషన్ లో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు. అయితే భోజనం చేసిన సుమారు గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు. తేలికగా, సౌకర్యవంతంగా ఉన్నంత సేపు మాత్రమే ప్రోనింగ్ చేయాలి. ప్రోనింగ్ చేసే సమయంలో దిండ్లను ఎప్పటికప్పుడు సౌకర్యవంతంగా ఉండేలామార్చుకోవచ్చు. రోజులో 16 గంటల వరకు ప్రోనింగ్ చేయవచ్చు.వెన్నెముకలో సమస్యలున్నవారు, గర్భిణులు, గుండె జబ్బు సమస్యలు ఉన్నవారు ప్రోనింగ్ చేయకపోవడమే మంచిది.
ప్రోనింగ్ చేయడం వల్ల శ్వాస తీసుకునే మార్గం సజావుగా మారి గాలి ప్రసరణ బాగుంటుంది . పల్స్ ఆక్సీ మీటర్వాడినప్పుడు ఆక్సిజన్ స్థాయి 94 శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ఈ ప్రోనింగ్ చేయాలి. ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ స్థాయి, శరీర ఉష్ణోగ్రత,షుగర్ లెవల్ పరిశీలించిన తరువాత మాత్రమే ఈ పద్ధతిని పాటించడం మంచిది. వీటితో పాటురూమ్స్ లో ఎక్కువ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి . ప్రోనింగ్ చేసే ముందు ఒకసారి వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అసలు మీ శరీరం ప్రోనింగ్ కు సహకరిస్తుందా లేదా అనే విషయం పరిశీలించాక ప్రోనింగ్ చేయడం మంచిది.
పార్ట్ 1 కోసం ఈ లింకుని క్లిక్ చెయ్యండి