సభలో అపశృతి: 10మందికి గాయాలు

నెరిమర్ల, మార్చి 17 : వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా నెరిమర్ల నియోజవర్గం డెంకాడ వద్ద అపశృతి చోటుచేసుకుంది.

జగన్మోహనరెడ్డి ప్రసంగం వినేందుకు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో గుడిగూడారు.

సమీపంలో ఉన్న డాబాలపై కూడా జనాలు ఎక్కారు. పాత మిద్దెపై నుండి ప్రహరీగోడ ఇటుకలు కిందపడటంతో ఒక మహిళతో పది మంది గాయపడ్డారు.

వీరిలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.