NewsOrbit
న్యూస్ హెల్త్

ఫోన్లు, కంప్యూట‌ర్ల‌ను వాడ‌డం వ‌ల్ల మెడ నొప్పిగా ఉందా ? ఈ 10 టిప్స్ పాటించండి..!

స్మార్ట్‌ఫోన్లు, కంప్యూట‌ర్లు.. ప్ర‌స్తుతం మ‌న‌కు ఎంత సౌక‌ర్య‌వంతంగా మారాయో అంద‌రికీ తెలిసిందే. వాటితో మ‌నం అనేక ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నాం. అయితే గంటల త‌ర‌బ‌డి ఆయా డివైస్‌ల‌ను వాడ‌డం వ‌ల్ల వాటితో టెక్ట్స్ నెక్ అన‌బ‌డే స‌మ‌స్య వ‌స్తోంది. దీని వ‌ల్ల వెన్నెముక‌పై ప్ర‌భావం ప‌డుతుంది. మెడ‌, వెన్నెముక నొప్పి క‌లుగుతుంది. అయితే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

10 tips and tricks to resolve text neck problem

1. కూర్చున్నా, నిల‌బ‌డ్డా శ‌రీర భంగిమ ప‌క్క‌కు ఒరిగిన‌ట్లు కాకుండా నిటారుగా ఉండేలా చూసుకోవాలి. దీంతో వెన్నెముక‌పై ప‌డే భారం త‌గ్గుతుంది. నొప్పి త‌గ్గుతుంది.

2. మొబైల్ ఫోన్ల‌ను ఎక్కువ‌గా వాడేవారు వాటిని మొబైల్ హోల్డ‌ర్స్ లేదా టేబుల్స్‌పై ఉంచి వాడితే చేతుల‌పై ఒత్తిడి త‌గ్గుతుంది. అలాగే కంప్యూట‌ర్ల‌ను వాడేవారు వాటిని స‌రైన టేబుల్స్‌పై ఉంచి వాడాలి. కేవ‌లం కంప్యూట‌ర్ల‌ను వాడ‌డం కోసం డిజైన్ చేయ‌బ‌డిన టేబుల్స్‌పైనే వాటిని వాడుకోవాలి. ఇలా చేస్తే శ‌రీరంపై భారం త‌గ్గి ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. మొబైల్ ఫోన్ల‌లో హెల్త్ ట్రాకింగ్ యాప్‌ల‌ను లేదా స్మార్ట్‌బ్యాండ్ల వంటి డివైస్‌ల‌ను వాడితే మీరు ఫోన్లు, కంప్యూట‌ర్ల‌పై ఎంత సేపు ప‌నిచేస్తున్నారో తెలుసుకోవ‌చ్చు. త‌ద్వారా వీలైనంత వ‌ర‌కు ఆ స‌మయాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే వ్యాయామాలు చేయ‌వ‌చ్చు.

4. గంట‌ల త‌ర‌బ‌డి ఆయా డివైస్‌ల‌పై ప‌నిచేసేవారు ప్ర‌తి 20 నుంచి 30 నిమిషాల‌కు ఒక‌సారి క‌నీసం 5 నిమిషాల పాటు అయినా స‌రే బ్రేక్ తీసుకోవాలి. అదే ప‌నిగా నిరంత‌రాయంగా ప‌నిచేస్తే శ‌రీరంపై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డుతుంద‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి.

5. కూర్చునే కుర్చీ, ఎదురుగా ఉండే టేబుల్ స‌రైన డిజైన్‌లో ఉండేలా చూసుకోవాలి. అలాగే డివైస్‌ల ఎదురుగా స‌రైన భంగిమ‌లో కూర్చోవాలి. దీంతో శ‌రీరంపై భారం ప‌డ‌కుండా ఉంటుంది.

6. ప‌నిచేస్తున్న‌ప్పుడు మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకుంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెడ‌ను అటు, ఇటు తిప్ప‌డం, బ్యాక్ స్ట్రెచెస్ చేయ‌డం, మెడ‌ను ముందుకు, వెన‌క్కి వంచ‌డం చేయాలి. దీంతో ఆయా భాగాలు బిగుసుకుపోకుండా.. స‌మ‌స్య ఉత్ప‌న్నం కాకుండా ఉంటుంది.

7. త‌ర‌చూ ప్రొఫెషన‌ల్‌ మ‌సాజ్ సెంట‌ర్ల‌లో బాడీ మ‌సాజ్ చేయించుకుంటుంటే ఈ త‌ర‌హా స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా అధిగ‌మించ‌వ‌చ్చు.

8. నిత్యం వ్యాయామం చేసేవారు మెడ‌, వెన్నెముక‌ల‌కు వ్యాయామం జ‌రిగేలా చూడాలి. ఆయా భాగాల‌కు స‌రిపోయే వ్యాయామాలు చేయాలి.

9. మొబైల్ ఫోన్ల‌ను కొంద‌రు చేతుల్తో ప‌ట్టుకుని మెడ‌ను కింద‌కు వంచి చూస్తారు. అలా కాకుండా ఫోన్ల‌ను క‌ళ్ల‌కు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. అందుకు మొబైల్ హోల్డ‌ర్ల‌ను వాడాలి. దీంతో టెక్ట్స్ నెక్ స‌మ‌స్య రాకుండా ఉంటుంది.

10. నొప్పి మ‌రీ ఎక్కువ‌గా ఉంటే ఐస్ లేదా హీట్ ప్యాక్స్ వాడ‌వ‌చ్చు. లేదా డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌వ‌చ్చు.

author avatar
Srikanth A

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!