శ్రీనగర్‌కు భారీగా భద్రతా బలగాలు

70 views

శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో కేంద్ర హోంశాఖ అత్యవసర ఆదేశాలతో వంద కంపెనీల పారా మిలిటరీ బలగాలను శ్రీనగర్‌కు వాయమార్గంలో తరలించారు.  కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో బలగాలను మొహరించి  ‌భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

వేర్పాటువాదులకు భధ్రతను తొలగించిన కేంద్రం వారిని అదుపులోకి తీసుకుంటోంది. ముందుగా జమ్ము కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్‌ను శ్రీనగర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడ నుండి తరలించారు. కాశ్మీర్‌ లోయలో ఉన్న జమాతే ఇస్లామీ వేర్పాటువాద సంస్థ అధినేత అబ్దుల్ హమీద్ ఫయాజ్‌తో పాటు ఆ సంస్థకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి మొత్తం ముమ్మరంగా గాలింపు చర్యలను కొనసాగించారు.

కాశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కట్టబెట్టే ఆర్టికల్ 35 ఎ పై సుప్రీం ధర్మాసనం ఈ నెల 25న కీలక తీర్పు వెలువరించనుంది.