భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ టీకాలు సురక్షితం కాదని అనుమానాలు ఇంకా ప్రజలకు నెలకొన్నాయి. రోజుకు ఒక చోట దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అనేక ఆరోగ్య సంస్థలు వీటిని ఖండించాయి. ఇలాంటి సమయంలో ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
అక్కడక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటు రెండు మూడు చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నవారు మృతిచెందడంతో టీకా కోసం రిజిస్టర్ చేసుకున్న వారు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో విఠల్ అనే ఒక 108 అంబులెన్స్ డ్రైవర్ వ్యాక్సినేషన్ సందర్భంగా కోవాగ్జిన్ తీసుకున్నాడు. ఇక రాత్రి అతను తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు మరణించాడు. ప్రస్తుతం అతని మృతిపై ప్రజా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. వారు విడుదల చేసిన ప్రకటనలో విఠల్ గుండెపోటుతో మరణించాడని చెబుతున్నారు. వ్యాక్సిన్ కు అతని మరణానికి ఏ సంబంధం లేదని అన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా నిపుణులు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ మరణం పై కమిటీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటువంటి వార్తలు బయటకు రావడంతో వ్యాక్సినేషన్ కు కొందరు వెనకడుగు వేస్తున్నారు. చాలాచోట్ల భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు.
Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…
BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…
Shruti Haasan: తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్…
Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`.…
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…