NewsOrbit
న్యూస్

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:10మంది మృతి

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో పది మంది వ్యవసాయ కూలీలు మృత్యువాతపడ్డారు. నాగుల‌ప్పపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీల‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్థంభాన్ని ఢీ కొట్టగా, విద్యుత్‌ వైర్లు తెగిపడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులు రాపర్ల సమీపంలోని మాచవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు నేపథ్యంలో వ్యవసాయ పనుల‌కు వెసులుబాటు కల్పించడంతో నేటి ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్‌పై మిరప కోతల‌కు వెళ్లారు. సాయంత్రం పనులు పూర్తి అయిన తరువాత ఇళ్ళకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 15 మంది వరకు ఉన్నారని తెలుస్తున్నది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌, మరో మహిళ తీవ్రంగా గాయపడగా వారిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు, ఓ రైతు ఉన్నారు.

సిఎం జగన్ దిగ్బ్రాంతి

ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లాకు చెందిన  మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

Leave a Comment