Govt Jobs: ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సంపాదించడానికి తల ప్రాణం తోకకు వస్తోంది. చేతిలో డిగ్రీలు ఉన్నాగాని ఉపాధి అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. మరోపక్క వయసు మీద పడుతూ ఉండటంతో.. ప్రభుత్వ ఉద్యోగ వయసు పరిమితి పెరిగిపోతూ ఉండటంతో నిరుద్యోగులు.. రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నారు. చదివిన చదువు బట్టి కింది స్థాయికి వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో చాలామంది నిరాశతో జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ కి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వయసు పరిమితి 18 నుండి 50 సంవత్సరాలు ఉంటే చాలు. జీతం పాతికవేలు ఆడవాళ్లు లేదా మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలలోకి వెళ్తే ఈ పోస్టులను ఆఫ్ లైన్ విధానం ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉండే వివిధ రకాల నాన్ టీచింగ్ స్థానాలకు సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఏ రాష్ట్రానికి చెందిన వాలైనా సరే అప్లై చేసుకోవచ్చు.

ఓబిసి జనరల్ క్యాండిడేట్స్ డిడి విధానం ద్వారా నేషనల్ బ్యాంకు ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ డిడి ని అప్లికేషన్ ఫామ్ కి పొందుపరచాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్.. ఈ ఏడాది13 అక్టోబర్. అప్లికేషన్స్ ఏ అడ్రస్ కి పంపాలంటే.. principal sainik school satara, satara 415 001, Maharashtra. ఇదే ఉద్యోగానికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

కవర్ ద్వారా పోస్ట్ ఆఫీస్ లో ఈ అప్లికేషన్ ని పైన అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు నిర్వహించబడే పరీక్ష.. కాల్ లిస్టులో మరియు ఈ మెయిల్స్ ద్వారా తెలియపరుస్తారు. ఇక తప్పనిసరిగా అప్లికేషన్ ఫామ్ కి క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ పొందుపరచాల్సి ఉంటుంది. ఒకే ఒక పరీక్ష తో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాల సెలక్షన్ ఉంటుంది.