మేకిన్ ఇండియా ద్వారా 111 మిలిటరీ ప్రాజెక్టులు

మేక్ ఇన్ ఇండియా పధకం కింద దేశంలో 111 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత మూడేళ్లలో మేకిన్ ఇండియా ప్రాజెక్టుల కింద దేశంలో 1.78లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 111 మిలిటరీ ప్రాజెక్టులను చేపట్టినట్లు కేంద్ర మంత్రి సుభాష్ బామ్రే తెలిపారు. 2015-16 నుంచి 2017-18 వరకూ 111 ప్రతిపాదనలకు ఆక్సెప్టెన్స్ ఆఫ్ నెసిసిటీ మంజూరైందని వివరించారు.

ప్రధాని నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇండియాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన లభిస్తున్నదని కేంద్ర మంత్రి సుభాష్ బామ్రే అన్నారు.

SHARE