Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు అసువులు బాస్తున్నారు. మరి కొందరు గాయాలతో బయటపడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా పలువురు క్షతగాత్రులు అయ్యారు.
వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలం కర్మలవారిపాలెం సమీపంలో తాడిపత్రి బైపాస్ రోడ్డు లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న పమాదంలో ముగ్గురు మృతి చెందారు, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన తల్లీ కూతుర్లు వెంకట సుబ్బమ్మ, చౌడం లక్ష్మీమునమ్మ, మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన వెంకట సుబ్బయ్యలు మృతి చెందగా, డ్రైవర్ తో పాటు ఓ బాలిక గాయాలతో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వరంగల్లు జిల్లా బొల్లికుంట వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరు వర్ధనపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే జిల్లా ఖమ్మం బైపాస్ హంటర్ రోడ్డు ఉరుసుగుట్ట వద్ద ఫ్లైఓవర్ పై రెండు కార్డు ఢీకొన్న ఘటనలో ప్రభుత్వ ఉద్యోగి అతని భార్య మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా సూరారం వద్ద రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ డైవర్ మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాస్ తండా వద్ద ద్విచక్ర వాహనాన్ని బొగ్గులారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు టేకులపల్లి మండలం ఎర్రాయగూడెెం కు చెందిన హనుమంత్, ఈసం స్వామిలుగా పోలీసులు గుర్తించారు.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…