NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Munna Gang Case: ఒకే కేసులో 12 మందికి ఉరిశిక్ష..! ఇండియాలో అతి సంచలన తీర్పులు ఇవే..!!

Munna Gang Case: హైవే కిల్లర్ మున్నా తో సహా అతని గ్యాంగ్ లోని 12 పన్నెండు మందికి ఏకకాలంలో ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించడం భారతదేశ చరిత్రలోనే అరుదైన తీర్పు అని న్యాయనిపుణులు చెబుతున్నారు.అయితే ఒకే కేసులో ఇంత మందికి ఉరి శిక్ష పడటం ఇదే ప్రథమం కాదని కూడా వారు వివరిస్తున్నారు.మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఇరవై ఆరు మందికి ఉరిశిక్ష పడిందని వారు పేర్కొంటున్నారు.1993 బాంబు పేలుళ్ల కేసుల్లో కూడా దశలవారీగా చాలా మందికి ఉరిశిక్ష పడింది అంటున్నారు.ఇక మున్నా కేసు విషయానికొస్తే మొత్తం ఏడు కేసుల్లో పన్నెండు మందికి ఉరిశిక్ష పడినట్లు వారు గుర్తుచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

12 hanged in one case ..! These are the most sensational verdicts in India .. !!
12 hanged in one case These are the most sensational verdicts in India

రాజీవ్ గాంధీ హత్య కేసు!

1991 మే ఇరవై ఒకటి వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు గురయ్యారు.పూలమాల వేసే నెపంతో మానవబాంబులు ఆయన దగ్గరకు వెళ్లి దగ్గరకు వెళ్లి తమను తాము పేల్చుకుని ఆయనను కూడా హతమార్చాయి.చెన్నైలోని స్పెషల్ కోర్టు ఈ కేసును విచారించింది.ప్రత్యేక టెర్రరిస్టు చట్టాల కింద విచారణ సాగింది.ఆ చట్టాలలోని సెక్షన్ల కింద ఈ కేసులో 26 మంది కి మరణశిక్ష విధించారు.అయితే వారంతా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న నేపధ్యంలో కేవలం ఒక్కరిని మాత్రమే ఇప్పటివరకు ఉరితీశారు.కానీ ఒకే కేసులో అత్యధిక మందికి ఉరిశిక్ష పడినది మాత్రం ఇందులోనేనని న్యాయపరమైన రికార్డులు చెప్తున్నాయి.

ముంబై పేలుళ్ల కేసు!

1993మార్చి పన్నెండు వ తేదీన ముంబాయ్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సంభవించిన పేలుళ్లలో 257 మంది మరణించారు..1500 మంది గాయపడ్డారు.భారత దేశాన్ని కుదిపేసిన ఈ టెర్రరిస్టు కుట్ర కేసులో దశలవారీగా పన్నెండు మందికి మరణశిక్షను విధించడం జరిగింది.స్పెషల్ డిజిగ్నేటెడ్ టాడా కోర్టు ఈ కేసును విచారించి ఇరవై ఏళ్ల తర్వాత 2013 లో శిక్షలు వేసుకుంటూ వెళ్లింది.అయితే ఈ కేసులో కూడా అందరికీ ఇంకా ఉరిశిక్ష అమలు జరగలేదు. వివిధ దశల్లో వారి అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి.

Munna Gang Case: మున్నా కేసు విషయానికొస్తే!

ప్రకాశం జిల్లాను ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ని కూడా హడలెత్తించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ మొత్తం ఏడు కేసుల్లో పదిహేడు మందిని హతమార్చినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేసింది.దీంతో ఆ గ్యాంగ్ లో పన్నెండు మంది ఉండగా మున్నాతో సహా పన్నెండు మందికి ఉరిశిక్షను,మరో నలుగురికి యావజ్జీవ కారాగారశిక్ష ,ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు నిచ్చింది.ఒకే కేసులో ఒకే రోజున అత్యధిక మందికి ఉరిశిక్ష పడిన కేసులలో రాజీవ్ గాంధీ హత్య కేసు తర్వాత మున్నా కేసే నిలుస్తోంది.అయితే ఇంతటితో వీరందరూ ఉరికంబం ఎక్కినట్లు భావించనక్కర్లేదు .అప్పీల్ చేసుకోవడానికి వారికి అనేక మార్గాలు ఉన్నాయంటున్నారు న్యాయ కోవిదులు.మరి ఏం జరుగుతుందో చూడాలి..

 

author avatar
Yandamuri

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju