NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Kuno National Park

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బార్ ఖేడా ప్రాంతంలో కునో నేషనల్ పార్కు ఉంది. షెయోపూర్, మొరేనా జిల్లాల్లో 344.686 చదరపు విస్తీర్ణంలో ఈ జాతీయ ఉద్యానవనం విస్తరించి ఉంది. 748 కిలోమీటర్ల వ్యాప్తిని కలిగి ఉంది. 1981లో ఈ ఉద్యానవనం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది. 2018లో దీన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు. ఈ పార్కులో ఆసియా సింహాలు, చిరుత పులులు, ఎలుగు బంట్లు, తోడేళ్లు, బంగారు నక్క, హైనా, దుప్పి, సాంబార్ జింకా, నీల్గాయ్, నాలుగు కొమ్ముల లేడి, కృష్ణ జింక, అడవి పందులు, ఆవులు ఉన్నాయి.

Kuno National Park
Kuno National Park

కునో నేషనల్ పార్కు అందాలు

కునో నేషనల్ పార్కు 748 కిలో మీటర్ల మేర విస్తరించిన ఉద్యానవన ప్రాంతం ఇది. ప్రకృతి అందాలు అలుముకుని ఉంటుంది. అంతరించిపోయే దశలో ఉండే క్రూర మృగాలు, జంతువులను ఆ పార్కులో సంరక్షిస్తుంటారు. ఇప్పటికే చాలా రకాల జంతులను కునో నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు. ఆ జంతువులను చూడటానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. దాంతో పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలల నుంచి కునో నేషనల్ పార్కుకు తరలి వస్తుంటారు.

Kuno National Park
Kuno National Park

మరో 12 చిరుతల రాక

తాజా సమాచారం ప్రకారం కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చిరుతలను తీసుకొని రానున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది చిరుతలను ఆఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకొచ్చారు. 70 ఏళ్ల క్రితం భారత్‌లో అంతరించిన చీతాలు మళ్లీ దేశంలో అడుగుపెట్టడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పుట్టిన రోజే ఆ ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్కులో వదిలారు. ఇందులో ఐదు ఆడ, మూగ చిరుత పులులు ఉన్నాయి. అదనంగా మరో 12 చిరుతలు రానుండటంతో అధికారులు వీటి కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లను ఏర్పాట్లు చేస్తున్నారు.

Kuno National Park
Kuno National Park

కునో నేషనల్ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా?

రైలు ప్రయాణం: కునో నేషనల్ పార్కుకు వెళ్లాలని అనుకునే వారికి ట్రైన్ సౌలభ్యం కలదు. కునో నేషనల్ పార్కుకు దగ్గర్లో గ్వాలియర్, సవాయ్ మధోపూర్, కోట, జైపూర్, ఝాన్సీ వంటి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి ట్రైన్ సహాయంతో మధ్యప్రదేశ్‌ కునో నేషనల్ పార్కుకు ఈజీగా చేరుకోవచ్చు. స్టేషన్‌ నుంచి పార్కుకు చేరుకోవడానికి బస్సు, ప్రైవేట్ వాహనాల సౌకర్యం కలదు.

విమాన ప్రయాణం: కునో నేషనల్ పార్కుకు వెళ్లాలని అనుకునే వారు విమాన సౌకర్యం కూడా కలదు. కునో నేషనల్ పార్కుకు దగ్గర్లోని గ్వాలియర్ ఎయిర్‌పోర్టు ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రైవేట్ బస్సుల, కార్లు అందుబాటులో ఉంటాయి.

బస్సు సౌకర్యం: తెలంగాణ, విజయవాడ నుంచి మధ్యప్రదేశ్‌ నీమచ్‌కు బస్సు సౌకర్యం కలదు. నీమచ్ నుంచి కునో నేషనల్ పార్కుకు 381 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి పార్కుకు వెళ్లడానికి ప్రైవేట్ బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

author avatar
Raamanjaneya

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N