NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్‌లోకి 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… జంపింగ్‌ల‌ లిస్టులో షాకింగ్ పేర్లు….?

తెలంగాణ‌లో రాజ‌కీయం రంజుగా మార‌బోతోంది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌ను దెబ్బ‌కొట్టేలా తెలంగాణ సీఎం రాజ‌కీయానికి తెర‌లేప‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. అస‌లు మూడు నెల‌ల క్రింద‌ట వ‌ర‌కు తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇక్క‌డ బీఆర్ఎస్‌కు అస్స‌లు తిరుగులేదు. పైగా కేసీఆర్‌కు ఎదురు చెప్పే నాథుడే లేకుండా పోయాడు. ప‌దేళ్ల పాటు అప్ర‌తిహ‌తంగా కేసీఆర్ తెలంగాణ‌ను ఏలుకుంటూ వ‌చ్చేశారు.

ఆ టైంలో బీఆర్ఎస్ టిక్కెట్ల కోసం ఏ స్థాయిలో పోటీ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బీఆర్ఎస్‌లో బండి కూడా ఓవ‌ర్ లోడ్ అయిన‌ట్టుగా ఉండేది. క‌ట్ చేస్తే రాజ‌కీయం ఇప్పుడు మూడు నెల‌ల‌కే మారిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా బ‌లంగా ప్ర‌భావం చూపింది. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు స్వీప్ చేసినంత ప‌నిచేసింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఇబ్ర‌హీంప‌ట్నం లాంటి ఒక‌టి, అరా సీట్లు మిన‌హా బీఆర్ఎస్ మిగిలిన స్థానాల్లో స్వీప్ చేసి గ్రేట‌ర్ ప‌రిధిలో త‌న‌కు ఉన్న ప‌ట్టు నిరూపించుకుంది.

అయితే ఇప్పుడు ఎన్నిక‌లు ముగిసి మూడు నెల‌లు కూడా కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ పునాదులు క‌ద‌ల‌డం మొద‌ల‌య్యాయి. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌లో 15 సీట్ల‌లో విజ‌యం సాధించ‌డ‌మే కాంగ్రెస్ ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతోంది. 15 సీట్లు టార్గెట్ పెట్టుకున్నా క‌నీసం 12 సీట్ల‌లో విజ‌యం సాధించి రాహుల్ గాంధీకి కానుక‌గా ఇవ్వాల‌న్న‌దే రేవంత్ రెడ్డి ముందున్న టార్గెట్‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించేందుకు రేవంత్ ముహూర్తం పెట్టేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇప్ప‌టికే 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్‌తో పాటు కాంగ్రెస్ ట‌చ్‌లోకి వ‌చ్చేసిన‌ట్టుగా తెలుస్తోంది. రేవంత్ ఎప్పుడు ఒకే చెపితే అప్పుడు ఈ 15 మంది ఎమ్మెల్యేలు కండువాలు మార్చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. వీరిలో ఎక్కువ మంది గ్రేట‌ర్ హైద‌రాబాద్ తో పాటు భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు, రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని ఎమ్మెల్యేలే ఉన్న‌ట్టు స‌మాచారం.

పార్టీలు మార‌డం మొద‌లు పెడితే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పెద్ద‌గా ఎవ్వ‌రూ మిగ‌ల‌కుండానే పోతార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇక ఇలా పార్టీ మారాల‌నుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది గ‌తంలో కాంగ్రెస్‌, టీడీపీల నుంచి గెలిచి పార్టీలు మారిన వాళ్లే… ఈ క్ర‌మంలోనే రేవంత్‌తో త‌మ‌కు ఉన్న సాన్నిహిత్యం నేప‌థ్యంలో వారంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju