NewsOrbit
న్యూస్

ఆర్‌సీఈపీ ఒప్పందం పైన 15 దేశాల సంతకాలు …!!

 

 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం‌‌పై 15 ఆసియా-పసిఫిక్ దేశాలు సంతకాలు చేశాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయినా ఆర్‌సీఈపీ(జనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌‌నర్‌‌షిప్ ) లో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కోసం ఏషియా దేశాలతోపాటు మరో ఐదు దేశాలు ఒప్పందం పత్రాల పైన సంతకాలు చేసాయి. వియత్నాం రాజధాని హనోయ్‌‌లో ఆదివారం నిర్వహించిన  సమావేశంలో ఆర్‌‌సీఈపీ దేశాలు పాల్గొన్నాయి.  వర్చువల్‌గా నిర్వహించిన 37వ ఏషియన్ సమ్మిట్ చివరి రోజున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

 

ఆసియా ఖండంలోని కొన్ని దేశాల మధ్య ఎనిమిది ఏళ్లుగా చర్చల్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్. తెలుగులో దీని అర్థం.. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం. ప్రాంతీయ దేశాల మధ్య వాణిజ్య సరుకులపై సుమారు 92శాతం పన్ను రాయితీలు, సభ్య దేశాలకు సేవారంగంలో 65శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశంలాంటి పలు అంశాలతో ఈ ఒప్పందాన్ని రూపొందించారు. 2012లో కంబోడియాలో జరిగిన ‘ఆసియాన్’ సదస్సులో ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం గురించిన చర్చలు మొదలయ్యాయి. గత ఎనిమిది ఏళ్లుగా దీనిపై ఆయా దేశాల నడుమ సంప్రదింపులు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రతిపాదనకు పలు దేశాలు మద్దతు తెలిపాయి. ఫలితంగా ఇది అతి పెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గా నిలిచింది. దీనితో ప్రపంచం ఆర్ధిక వ్యవస్థలో మూడోవ వంతు ఒప్పందం దీని పరిధిలోకి రానున్నది. కోవిద్ 19 మహమ్మారి నేపథ్యంలో, ఆర్ధికంగా ఎదురు అయినా ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది అన్ని ఆ దేశాలు ఆశిస్తున్నాయి. మరోవైపు ఒప్పందం లో భాగంగా సుంకం తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో విదేశీ వస్తువులు వెలువుల వచ్చి పడి, దేశీయ తయారీ వ్యవస్థి దెబ్బతింటుంది అనే ఉద్దేశం తో, ఈ ఒప్పందంపై గతేడాది భారత్ తన అయిష్టతను తెలియజేసిన విషయం తెలిసిందే. అణగారిన వర్గాలు, పాడి, నూనె గింజల రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ ఒప్పందంలో చేరవద్దని నిరసనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ప్రధాని మోడీ భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం లో భాగస్వామి గా చేరేందుకు భారత్ కు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి అన్ని ఆర్‌సీఈపీ లోని దేశాలు తెలిపాయి. ఒప్పందంలో చేరాలి అంటే భారత్ దేశం సమ్మతి తెలుపుతూ లిఖితపూర్వకంగా అభ్యర్ధన సమర్పిస్తే ఆర్‌సీఈపీ లోని దేశాలు భారత్ తో చర్చలు జరుపుతాయి అన్ని డిక్లరేషన్ లో పేరుకొన్నది.

Related posts

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?