16న కరుణ విగ్రహావిష్కరణ

డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి విగ్రహా విష్కరణ కార్యక్రమం ఈ నెల 16న జరగనుంది. ఈ విగ్రహాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబబునాయుడు, కేరళ సీఎం పినరయ్ విజయన్, పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాజరు అవుతారు. ఈ మేరకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మీడాయాకు సమాచారం ఇచ్చారు. అలాగే కరుణ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజకీయ నాయకులుగా మారిన నటులు కమల్ హసన్, రజనీకాంత్ లను కూడా ఆహ్వానించినట్లు స్టాలిన్ తెలిపారు. ఆ ఇరువురూ రాజకీయాలను అనర్హులని గతంలో స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారిరువురికీ కూడా ఆహ్వానాలు పంపడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.