Breaking: హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ముఠాలు కుట్రలు పన్నినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన అయిదుగురిన అరెస్టు చేశారు. ఉగ్రకదలికల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ సాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు గుర్తించారు.

గత 18 నెలలుగా హైదరాబాద్ లోనే నిందితులు మకాం వేసి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ పాత బస్తీలోని అయిదుగురు నిందితులను మధ్యప్రదేశ్ పోలీసులు నిందితుల నుండి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ డివైజ్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారిస్తే మరి కొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా నిందితులు ఎంత మందిని ఉగ్రవాదం వైపు మళ్లించారు అనేది దర్యాప్తు లో తేలాల్సి ఉంది.
TS Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .. విద్యార్ధులకు కీలక సూచన