చర్చి వద్ద బాంబు పేలుళ్లు :17మంది మృతి

మనీలా, జనవరి 27: ఫిలిప్పీన్స్‌లో బాంబులు పేలిన ఘటనలో 17మంది మృతి చెందారు. మరో 43మందికి పైగా గాయాలు అయ్యాయి. జోలో ఐలాండ్‌లోని రోమన్ కాథలిక్ చర్చి వద్ద ఆదివారం రెండు బాంబులు పేలాయి.

మిలటరీ అధికార ప్రతినిధి ఎడ్గార్డ్ అరేవాలో డిజిఎంఎం రేడియాతో మాట్లాడుతూ బాంబు పేలుళ్ల ఘటనలో ఐదుగురు సైనికులు, 12మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. మరో 43మంది గాయపడినట్లు వెల్లడించారు.

మొదటి బాంబు పేలుడు చర్చ ఆవరణలో తరువాత పార్కింగ్ స్థలంలో బాంబు పేలినట్లు సమాచారం. ఈ దుర్ఘటనకు అబూ సయ్యఫ్ టెర్రరిస్ట్ గ్రూపు కారణమని భావిస్తున్నారు.