Pushpa: కరోనా విలయతాండవం కాస్త నెమ్మదించిన తర్వాత స్టార్ హీరోల సినిమాల షూటింగ్ లు చాలా స్పీడ్ అందుకున్నాయి. చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఐటమ్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా “పుష్ప” చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండటం మాత్రమే కాక లారీ డ్రైవర్ కథ నేపథ్యంలో.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కథ కావడంతో… సుకుమార్ ఈ సినిమాని ఏ తరహాలో డీల్ చేశాడు అన్నది సినిమా ఆడియోస్ లో ఉత్కంఠభరితంగా ఉంది. ఇటీవలె రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు పుష్పా టీం ప్రకటించడం జరిగింది. “దాకో దాకో మేక” అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఈ సాంగ్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు.. ఖర్చు చేయడం జరిగిందట. ఇప్పటికే కొద్దిపాటి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ బిట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉండటంతో పాటు సాంగ్ ఎలా ఉంటుంది అన్న తరహాలో ప్రేక్షకులలో ఉత్కంఠత రేపటం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా.. డిసెంబర్ మాసంలో రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లూ ఫిలింనగర్ టాక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?